గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గాంధీ జయంతిని పురస్కరించుకుని తన నివాసం దగ్గర పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ ఉద్యమంలో చేరేందుకు ఇతరులను ప్రేరేపించారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి కర్తవ్యం. పరిశుభ్రతను కాపాడుకోవడం ద్వారా మనం గాంధీ వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా.. మనకు మరియు భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన, సంపన్నమైన సమాజాన్ని సృష్టిస్తామని అన్నారు.