ఓయూలో మంగళవారం విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఓయూకు వెళ్లే రహదారులను బందు చేసిన పోలీసులు. ఓయూ టెక్నాలజీ హాస్టల్ బాత్రూం పైకప్పు పెచ్చులు మీద పడి ఒక విద్యార్థికి స్వల్ప గాయాలు అయ్యాయి. తమకు భద్రత కల్పించాలనీ డిమాండ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదనీ, బాత్రూములు, రూములలో కూడా పెచ్చులు ఊడి పలుమార్లు విద్యార్థులపై పడిపోయాయి అని మండిపడ్డారు.