పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ కాన్ పేట గ్రామంలో గ్రీన్ చాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా జమ్మి చెట్టును నాటిన అనంతరం మాట్లాడారు.