కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ మొదటి రోజు కావడంతో ఎంగిలి పూల బతుకమ్మతో కుత్బుల్లాపూర్, సూరారం కట్ట మైసమ్మ, హెచ్ ఎ ఎల్ రాఘవేంద్ర కాలని, బహదూర్ పల్లి గ్రీనిల్స్ కాలనీ లో బుధవారం బతుకమ్మలతో అందరూ ఒక్క దగ్గరికి చేరి, బతుకమ్మ పాటలు పాడుకుంటూ, కొలాటాలతో నృత్యాలు చేశారు.