
కుత్బుల్లాపూర్: ఆదాయం, కులం ధ్రువ పత్రాలు సకాలంలో అందజేయండి
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, ఈబీసీ కేటగిరి నిరుద్యోగులకు సబ్సిడీలతో పాటు రుణాలు అందజేస్తుంది. వాటికి కులం, ఆదాయం ధ్రువ పత్రాలు పొందుపరచాలి. 5 ఏప్రిల్ 2025 చివరి తేదీ ఉండడం వలన ధ్రువ పత్రాలు అందజేయడంలో జాప్యం జరగకుండా వెంటనే అందజేయాలని కుత్బుల్లాపూర్ డిప్యూటీ ఎమ్మార్వో మల్లికార్జున్ కి తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకుడు సాయికుమార్ గురువారం వినతిపత్రం అందజేశారు.