భాగ్యలక్ష్మి కాలనీ నేతాజీ స్కూల్ దగ్గర కుక్కలు స్వైరవిహారం

81பார்த்தது
భాగ్యలక్ష్మి కాలనీ నేతాజీ స్కూల్ దగ్గర కుక్కలు స్వైరవిహారం
కుత్బుల్లాపూర్ మండలం భాగ్యలక్ష్మి కాలనీ నేతాజీ హైస్కూల్ పక్క సందులో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. స్కూల్ కి వెళ్లే దారిలో కుక్కలు తిష్ట వేయడంతో పిల్లలు ఇంటి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ మధ్య చిన్న పిల్లలపై కుక్కల దాడులతో పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పేరెంట్ సాయి గౌడ్ గురువారం తెలిపారు. మునిసిపాలిటీ అధికారులు సకాలంలో స్పందించి కుక్కలను జనవాసల నుంచి దూరంగా తరలించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி