హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఈనెల 25న నిర్వహించే మాలల మహాపాదయాత్ర పోస్టర్ ను బుధవారం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆప్రయత్నాలను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. 'హలో మాల ఛలో భద్రాచలం' ప్రారంభ పాదయాత్రకు వేలాదిగా మాలలు తరలిరావాలని వారు కోరారు.