

"ఆపరేషన్ కగార్" హత్యాకాండను ఖండించిన పౌర హక్కుల సంఘం
మధ్యభారతంలో "ఆపరేషన్ కగార్" పేరుతో కొనసాగుతున్న ప్రభుత్వ హత్యాకాండను పౌర హక్కుల సంఘం తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండించింది. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మరణించారని, మొత్తం నాలుగు నెలల్లో 470 మంది ప్రాణాలు కోల్పోయారని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, అధ్యక్షుడు లక్ష్మణ్ గడ్డం తెలిపారు. ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని శనివారం ఎన్ఎస్ఎస్లో వారు డిమాండ్ చేశారు.