

బోడుప్పల్ లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ లో భాగంగా 5కె రన్
సైబర్ క్రైమ్ అవేర్నెస్ లో భాగంగా 5కె రన్ కార్యక్రమం మేడ్చల్ జిల్లా బోడుప్పల్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. జెండా ఊపి 5కె రన్ ప్రారంభించి విజేతలకు సర్టిఫికెట్ లను అందించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు, బెట్టింగ్ యాప్స్, తెలియని యాప్ లలో డబ్బులు పెట్టి మోసపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ, ఈ ఫిట్నెస్ 5కె రన్ ద్వారా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రన్ నిర్వహిస్తున్నాము అని నిర్వాహకులు జయసింహ తెలిపారు.