మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల చిన్నక్రాంతి కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ మాట్లాడుతూ నూతన రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.