కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగనాయక స్వామి ఆలయం సమీపంలోని హానర్స్ కన్స్ట్రక్షన్ లో అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్ లైన్ వేయడానికి తవ్వుతున్న క్రమంలో పైన ఉన్న మట్టి పడిపోయి బీహార్ కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే అతని ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిన ఎలాంటి భద్రత జాగ్రత్తలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపించారు.