పేద ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం తన నివాసం వద్ద పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయని చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎవరికైనా వైద్య సహాయం కావాలంటే సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. త్వరగా చెక్కులు మంజూరు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.