
ఖైరతాబాద్: సచివాలయంలో నకిలీ ఎమ్మార్వో అరెస్ట్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నకిలీ ఉద్యోగి అరెస్ట్ అయ్యాడు. కొంపల్లి అంజయ్యను బీఆర్ఎస్పీఎఫ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నకిలీ గుర్తింపు కార్డును ఉపయోగించి తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గా చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఐడి నకిలీ అని తేలింది. విచారణ నిమిత్తం నిందితుడిని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.