జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య క్రమానికి నూతన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలాంబర్తి హాజరైయ్యారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కమిషనర్ ఆదేశించారు.