రద్దయిన నోట్ల మార్పిడి ముఠా అరెస్టు

50பார்த்தது
రద్దయిన నోట్లను మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం హైదరాబాద్ అబిడ్స్‌లోని తాజ్ మహల్ హోటల్ వద్ద అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సయ్యద్ ముజమ్మిల్ హుస్సేన్ సహా అంజద్ ఖాన్, పల్తి భాస్కర్, షేక్ నసీమ ల వద్ద నుంచి ₹55. 52 లక్షల రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி