ఓయోకు భారీ లాభం.. ఏకంగా రూ.100 కోట్లు!

69பார்த்தது
ఓయోకు భారీ లాభం.. ఏకంగా రూ.100 కోట్లు!
ఓయో కంపెనీ తొలిసారిగా రూ.100 కోట్ల నికర వార్షిక లాభాన్ని ఆర్జించిందని ఆ సంస్థ సీఈవో రితేష్ అగర్వాల్ వెల్లడించారు. 2023-24లో రూ.100 కోట్ల లాభం వచ్చిందని, ఓయో లాభాలను నమోదు చేయడం ఇదే తొలి ఆర్థిక సంవత్సరం అని అన్నారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ.1,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని తెలిపారు. కాగా, 2023-24 ఆదాయ గణాంకాలు వెల్లడి కానప్పటికీ, ఓయో ఆదాయం రూ.5,800 కోట్లుగా ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ ఇప్పటివరకు నివేదించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி