ఇజ్రాయెల్ పై 140 రాకెట్లతో విరుచుకుపడ్డ హిజ్బొల్లా

62பார்த்தது
ఇజ్రాయెల్ పై 140 రాకెట్లతో విరుచుకుపడ్డ హిజ్బొల్లా
పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై హెజ్బొల్లా ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ పై తాజాగా 140 రాకెట్లతో హెజ్బొల్లా విరుచుకుపడింది. ఉత్తర ఇజ్రాయెల్ లోని మిలటరీ బ్యారెక్ పై దాడులు జరిపినట్లు హెజ్బొల్లా వెల్లడించింది. లెబనాన్ సరిహద్దుల నుంచి మూడు దఫాలుగా రాకెట్లు దూసుకొచ్చిన విషయాన్ని ఇజ్రాయెల్ మిలటరీ సైతం ధ్రువీకరించింది. నష్టం వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

தொடர்புடைய செய்தி