ప్రముఖ నటుడు అజిత్ ప్రస్తుతం పోర్చుగల్‌లో రేసులో పాల్గొంటున్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. 'ట్రైనింగ్ సమయంలో చిన్న ప్రమాదం జరిగిందని, మా టీమ్ సత్వర స్పందన కారణంగా ఎలాంటి గాయాలు లేకుండా శిక్షణ కొనసాగిస్తున్నానని చెప్పారు. నా అభిమానులు మోటార్ స్పోర్ట్స్ పట్ల చాలా ఆసక్తి చూపుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను.' అని అన్నారు.