హర్యానాలోని గురుగ్రామ్‌లో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. పంకజ్ జునేజా అనే వ్యక్తి కూరగాయల మార్కెట్ ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్లాడు. ఆ సమయంలో అతడిని ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. కొద్ది దూరం పంకజ్‌ను ఆ కారు ఈడ్చుకెళ్లింది. కారుతో ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.