ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు రూ. 500 బొనస్ ఇస్తున్నామని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. గురువారం ఉట్కూర్ మండల కేంద్రంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు తమ శాతం లేకుండా నాణ్యమైన వరి ధాన్యం తేవాలని సూచించారు. అనంతరం భవాని మాత ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.