ప్రతి పశువు డాటాను సేకరించాలి: మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం
ప్రతి పశువు డాటాను సేకరించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పశు గణన సర్వేకు చెందిన పోస్టర్ ను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి పశు గణన సర్వే జరుగుతుందని పశు వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. మధుసూదన్ గౌడ్, డా. వేంకటేశ్వర్లు, డా. రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.