వక్స్ చట్టాన్ని సవరణ పేరుతో సమాధి చేస్తే సహించం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇన్సాఫ్ జాతీయ మహాసభలు శనివారం నిర్వహించారు. ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్ పాషా మాట్లాడుతూ.. వక్స్ చట్టాన్ని సవరణ పేరుతో కేంద్రం సమాధి చేస్తే సహించేది లేదని, రైల్వే, రక్షణ శాఖల తర్వాత అత్యధిక ఆస్తులున్నది వక్స్ బోర్డుకేనన్నారు. 14% ముస్లింలకు 30% ఆస్తులు ఎందుకని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. లౌకిక ప్రజాస్వామ్య శక్తులు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.