ఆర్టీసీ బస్సులో బంగారం మాయం
ఆర్టీసీ బస్సులో 9 తులాల బంగారం కనిపించకుండా పోయింది. ఈ ఘటన బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. మహేష్ అతని భార్య సువర్ణ పిల్లలతో కలిసి నాగర్ కర్నూల్ బస్టాండ్ లో కల్వకుర్తి బస్సు ఎక్కారు. ముందే పర్సులో 9 తులాల బంగారు ఆభరణం భద్రపరిచారు. టికెట్ తీసుకునేందుకు పర్సు తీయగా అందులోని బంగారం కనిపించలేదు. వెంటనే తోటి ప్రయాణికులకు తెలపడంతో బస్సు ఆపి సోదాలు నిర్వహించిన ఫలితం లేకపోయింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.