బడి ఉంటేనే బస్సు వస్తుందని, బడి లేకపోతే బస్సు బంద్ అవుతుందని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల, నక్కలపల్లి గ్రామాల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి పాఠశాల ఉన్న లేకపోయినా ఆర్టీసీ బస్సును యధావిధిగా నడిపి ఆ గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులకు గురికాకుండా అధికారులు స్పందించి బస్సులు నడపాలని ఆ గ్రామాల ప్రజలు సోమవారం కోరారు.