కరెంట్ షాక్ తో రైతు మృతి
కొల్లాపూర్ మండలం సున్నం భాయ్ తండాకు చెందిన సీతారాం నాయక్ అనే రైతు మంగళవారం సాయంత్రం 6: 30 గంటలకు వ్యవసాయ పొలం దగ్గర కరెంట్ షాక్ తో మృతి చెందడం జరిగింది. మృతునికి భార్య, అయిదుగురు పిల్లలు ఉన్నారు. ఎంతో కలిసిమెలిసి ఉండే సీతారాం నాయక్ కరెంటు షాక్ తో మృతి చెందడంతో తాండ ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వం స్పందించి సీతారాం నాయక్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.