పేకాట స్థావరంపై దాడి

50பார்த்தது
పేకాట స్థావరంపై దాడి
జిల్లా కేంద్రమైన గద్వాలలోని జమ్మిచేడు సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో జరుగుతున్న పేకాట స్థావరంపై గద్వాల పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. రూ. 2 లక్షల నగదు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారని గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో కలిసి దాడులు చేసినట్లు ఆయన వివరించారు.

தொடர்புடைய செய்தி