రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మహబూబ్ నగర్ కలెక్టరేట్ కు ఫిర్యాదు చేయనున్నట్టు జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేవుడితో సమానం అన్నారు.