ఆకతాయిల నుంచి మహిళల రక్షణకు షీటీం ఉందని ఎస్పీ జానకి ధరావత్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ. పనిచేసే చోట, బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లలో మహిళలు వేధింపులకు గురైతే వెంటనే 100 కు డయల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. మహిళలకు రక్షణగా షీటీం ఎల్లప్పుడూ పనిచేస్తుందన్నారు. 100 కు డయల్ చేసిన వెంటనే పోలీసులు స్పందించాలని ఆదేశించారు.