తల్లి నుంచి విడిపోయి పంట చేలోకి చేరిన మనుబోతు పిల్లను ఫారెస్ట్ అధికారులు అక్కున చేర్చుకున్నారు. దాని ఆలనాపాలనా చూస్తున్నారు. గత నెల 2న అమ్రాబాద్ మండలం మన్ననూర్ సరిహద్దు అటవీ సమీపంలోని ఓ పంట పొలంలో మూడు నెలల మనుబోతు పిల్ల ఉండడాన్ని రైతు గుర్తించాడు. దాని తల్లి కనిపించలేదు. ఫారెస్ట్ సిబ్బంది ఆ మనుబోతు పిల్లను మంగళవారం పట్టుకుని డీఎఫ్వో రోహిత్ గోపిడి క్వార్టర్ ఆవరణలో వదిలి దాని బాగోగులు చూస్తున్నారు.