ఎన్నికల ప్రచారంలో భాగంగా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపై నుంచి నీళ్లు పోసుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని రుద్రపూర్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగారు. ఆ కాసేపటికే 'చాలా వేడిగా ఉంది' అంటూ తలపై నీళ్లు పోసుకున్నారు. కాగా, యూపీలో నిన్న రికార్డు స్థాయిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.