అడవి నుంచి బయటకు వచ్చి డ్రెయినేజీలో చిక్కుకుపోయిన జింక (వీడియో)

63பார்த்தது
అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఓ జింక డ్రెయినేజీలో చిక్కుకుపోయింది. ఈ ఘటన ఒంగోలు బైపాస్ రోడ్డుపై జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ జింక రోడ్డుపై పరిగెడుతూ వచ్చి బైక్‌ను ఢీకొట్టి కాలువలో పడిపోయింది. దీంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బయటకు రాలేక అవస్థలు పడుతున్న జింకను ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది రక్షించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం ఒంగోలు ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు.

தொடர்புடைய செய்தி