ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు.. కుట్రకోణంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులు

69பார்த்தது
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవలు.. కుట్రకోణంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులు
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఒకటో తేదీ తెల్లవారుజామున 3 భారీ పడవలు, ఒక చిన్న పడవ బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. ఒకేసారి నాలుగు పడవలు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం ఉందేమోనని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. కాగా పడవలు ఢీకొట్టడంతో 2 గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి.

தொடர்புடைய செய்தி