పవన్ కళ్యాణ్ అభిమానులకు 'హరిహర వీరమల్లు' మూవీ మేకర్స్ బ్యాడ్‌న్యూస్ చెప్పారు. ఇటీవల మూవీ మేకర్స్ జనవరి 6న స్వయంగా పవర్ స్టార్ ఆలపించిన “మాట వినాలి” అనే సాంగ్ ను ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా మేకర్స్ మరో ప్రకటన విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని వెల్లడించారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వివరించారు.