రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పల్సి గ్రామానికి చెందిన రాజారాం, పరుశురాం పని నిమిత్తం బైక్ పై కుబీర్ వెళుతుండగా ఎదురుగా వస్తున్న మహీంద్రా మాక్స్ వాహనం ఢీకొనడంతో రాజారాం (22)అక్కడికక్కడే మృతి చెందగా పరుశురాం కు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.