మంచిర్యాల: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వెంకట్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత వ్యక్తి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు