విశ్వ ఆర్ట్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ సరస్వత పరిషత్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన నాట్యోత్సవంలో మంచిర్యాల జిల్లా కళాకారులు ప్రతిభ కనబరిచారు. శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్, నాట్య విభూషణి అన్నం కల్పన శిష్య బృందం సాధిక, ఆలోకి, నికిత, అభిజ్ఞశ్రీ, కూచిపూడి నాట్య ప్రదర్శనలకు ఇంగ్లీష్ బుక్ ఆఫ్ రికార్డ్ ను ప్రధానం చేశారు. అలాగే గరువు అన్నం కల్పనను ఘనంగా సన్మానించారు.