విద్యార్థులు చెడు మార్గంలో వెళ్లి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మంచిర్యాల జిల్లా సివిల్ జడ్జ్ అర్పిత మారం రెడ్డి సూచించారు. జాతీయ న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా శనివారం మంచిర్యాల బాలుర ఎస్టీ హాస్టల్ లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిస కావద్దని తెలిపారు.