మహేశ్వర్ రెడ్డి చిలకజోస్యం మానుకోవాలి: మంచిర్యాల ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవి వియోగం ఉందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చిలక జోష్యం చెప్పడం మానుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హితవు పలికారు. ఆదివారం ఐబీ స్థలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత జ్యోతిష్యం నేర్చుకున్నాడని ఎద్దేవా చేశారు.