మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ తో పాటు రోడ్డు విస్తరణకు చేస్తున్న ప్రక్షాళన కొందరికి నష్టం కలిగించినప్పటికీ భావితరాలకు ప్రయోజనం చేకూరుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్కొన్నారు. శనివారం ఆయన మంచిర్యాల మార్కెట్ లోని పలురోడ్లను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో పాటు విశ్వనాథ ఆలయాల ఈవో ముక్త రవిలకు రోడ్డు విస్తరణ పై తీసుకోవాల్సిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు.