తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును మంచిర్యాల జిల్లాకు పెట్టాలని జాతీయ బీసీ హక్కుల సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో జన్మించిన లక్ష్మణ్ బాపూజీ తొలి, మలి దశ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లాకు లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.