సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

67பார்த்தது
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోవాలని ఉద్యోగులు ఎమ్మెల్యేతో తెలిపారు. తమకు కనీస ఉద్యోగ భద్రత లేదన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని వారికి హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி