
బోథ్: వాలీబాల్ కోర్టును ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ
తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఉగాది పండగ సందర్భంగా వాలీబాల్ కోర్టును గ్రామస్తులతో కలిసి మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. గ్రామాలలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోతా రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, ఎన్ అశోక్, గాజుల సాంబశివ్, గోక ప్రకాష్ రెడ్డి, గంగన్న, బాలాజీ, తదితరులు ఉన్నారు.