ఈనెల 18న బోథ్ బంద్

81பார்த்தது
ఈనెల 18న బోథ్ బంద్
మహమ్మద్ ప్రవక్తపై యతి నరసింహానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బోథ్ ముస్లిం జేఏసీ సభ్యులు పేర్కొన్నారు. బుదవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. యతి నరసింహానంద సరస్వతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న శుక్రవారం బోథ్ బంద్ కు పిలుపునిస్తున్నట్లు వారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி