ఆదిలాబాద్ చందా -టి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మహాలక్ష్మీ, రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని తెలంగాణ కిషన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గ్రామస్థులు, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు.