కుష్టు వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలని డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్ రావు, రమేష్ లు అన్నారు. బుధవారం మావల మండలం వాఘాపూర్ కొలంగూడా గ్రామాన్ని వారు సందర్శించారు. గ్రామంలో కుష్టు వ్యాధికి చికిత్స పొందుతున్న రోగిని, వారి కుటుంబ సభ్యులను పరీక్ష చేశారు. చికిత్స పూర్తయ్యే వరకు గ్రామానికి సంబంధించిన ఆశా కార్యకర్త నెలకోసారి రోగి ఇంటిని సందర్శించి పరిశీలించాలని అన్నారు.