ఆధార్, పాన్‌లతో సహా భారత పౌరులకు సంబంధించిన సున్నితమైన వివరాలు బహిర్గతం చేస్తున్న వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఇటువంటి కొన్ని వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఆయా వెబ్‌సైట్లలో భద్రతా లోపాలు ఉన్నట్లు కేంద్ర ఐటీశాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.