యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

71பார்த்தது
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
హైదరాబాద్ లోని ఉప్పల్ లో గురువారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భువనగిరికి చెందిన సాయికుమార్ అనే యువకుడు తనను ప్రేమించాలని ఉప్పల్ బస్టాప్ లో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి గాయమైంది. చికిత్స నిమిత్తం యువతిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. వారిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி