దూరదృష్టితో దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఢిల్లీలో ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించిన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. మన్మోహన్ సింగ్ మరణం బాధాకరమని, ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని ప్రకటించారు.