TG: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు దంపతులను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతులను రామయ్యపల్లె గ్రామానికి చెందిన కూస చంద్రయ్య(60), కూస భాగ్యమ్మ(55) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.