దళిత వర్గానికి చెందిన వారిపై దాడి కేసులో కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా సెషన్స్ కోర్టు 98 మందికి జీవిత ఖైదు విధించింది. మరకుంబిలో తమ వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేశారని ఆగస్టు 28, 2014లో అగ్రకులస్థులు సామూహికంగా దళితులపై దాడి చేసి వారి నివాసాలకు నిప్పుపెట్టారు. ఈ కేసులో 98 మంది నిందితులకు జీవిత ఖైదు, ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మరో ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.